మహాఘనుడా యెహోవా - Lyrics & Meaning
ADVERTISEMENT
✨ ఆధ్యాత్మిక విశ్లేషణ (Spiritual Insight)
"మహాఘనుడా యెహోవా" అనే ఈ కీర్తన దేవుని యొక్క సర్వవ్యాప్తతను మరియు ఆయన కృపను కొనియాడుతుంది. ముఖ్యంగా ఈ పాటలో దేవుని పేర్లైన 'ఏల్ ఎలోహీం' (సర్వశక్తిమంతుడు), 'ఎల్షద్దాయ్' (పోషకుడు), మరియు 'ఎబినేజరు' (సహాయకుడు) వంటి పదాలను వాడటం వల్ల భక్తుడికి దేవునిపై ఉన్న అచంచలమైన విశ్వాసం వ్యక్తమవుతుంది. జీవితంలో ఎదురయ్యే కొండలు, లోయల వంటి కష్టాలను దేవుడు ఎలా సమభూమిగా మారుస్తాడో ఈ పాటలోని సాహిత్యం ఎంతో ఊరటనిస్తుంది.
ప్రభుప్రేమ నాలో నింపుటకే దిగివచ్చినావు
మహిమాత్ముడా త్రిత్వమై జీవించువాడవు
కీర్తించి మహిమపరతును స్తుతించి ఆరాధింతును
నీకే నా ఆరాధన - హల్లేలూయా
ఏల్ ఎలోహీం నీవే - ఎల్షద్దాయ్ దేవుడవు
ఎబినేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే
ఏల్ ఎలోహీం నీవే - ఎల్షద్దాయ్ దేవుడవు
ఎబినేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే
నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా - నీవేగా
అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా - నీవేగా
విధినే చేధించి నీవు - భువినే వెలిగించగా
స్తుతినే నానోట పలికించి బహుగా దీవించగా
గళమెత్తి కీర్తింతును
అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా - నీవేగా
విధినే చేధించి నీవు - భువినే వెలిగించగా
స్తుతినే నానోట పలికించి బహుగా దీవించగా
గళమెత్తి కీర్తింతును