Chinni Chinni Song Lyrics
Movie: Bootcut Balaraju (2024) | Music: Anudeep Dev
🎤 Singer: Sai Veda Vagdevi
✍️ Lyricist: Ranjith Kumar Ricky
🎭 Cast: Syed Sohel Ryan, Meghalekha, Sunil
చిన్ని చిన్ని లిరిక్స్
చిన్ని చిన్ని ఆశలన్నీ
అల్లుకున్న మేఘమాలలై సాగెనే...
చిట్టి చిట్టి ఆటలన్నీ
ఆడుకున్న ఆట బొమ్మలై చేరెనే!
ఏదో ఒక అందమైన నవ్వులోన
స్నేహం వచ్చి ఊయలూగెనే
పాదం చిన్ని గంతులేసే హాయిలోన
లోకం అరె చిన్నదాయెనే!
తీరాన ఉన్నా దూరన ఉన్నా
స్నేహాన నే ఉండనా...
సంతోషమైనా సందేహమైనా
నీతోనే తోడుండనా!
ఆగి ఆగి చూసే కంటి రెప్పలు
నిన్ను దాచిపెట్టి చూడనా...
దాగి దాగి చేసే చిన్న అల్లరి
నీతో నేను చేరి ఆడనా!