'కళ్ళల్లోకి కళ్ళు పెట్టి' సాంగ్ లిరిక్స్

'కళ్ళల్లోకి కళ్ళు పెట్టి' సాంగ్ లిరిక్స్

'కళ్ళల్లోకి కళ్ళు పెట్టి' సాంగ్ లిరిక్స్



కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు

ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం
గతమంటూ ఏంలేదని చెరిగిందా ప్రతి ఙాపకం
కనులు మూసుకుని ఏం లాభం
కలైపోదుగా ఏ సత్యం
ఎటూ తేల్చని నీ మౌనం
ఎటో తెలియని ప్రయాణం
ప్రతి క్షణం ఎదురయే నన్నే దాటగలదా
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు

గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా
నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా
నిన్నామొన్నలనీ నిలువెల్ల
నిత్యం నిన్ను తడిమే వేళ
తడే దాచుకున్న మేఘంలా
ఆకాశాన నువ్వు ఎటువున్నా
చినుకులా కరగక శిలై ఉండగలవా
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు

Post a Comment

If you have any doubts. Please let me know

Previous Post Next Post

Popular Items