
Mounamgane Edagamani Song Lyrics – Naa Autograph Telugu Movie

Mounamgane Edagamani Song Credits
Naa Autograph MovieReleased Date – 2004Director S.Gopal ReddyProducer Bellamkonda SureshSingers ChitraMusic M M KeeravaniLyrics Chandra BoseStar Cast Ravi Teja, Bhoomika, GopikaMusic LabelAditya MusicMounamgane Edagamani Song Lyrics In EnglishMounamgane Edhagamani Mokka Neeku Chebuthundi Edhigina Koddhi Odhagamani Ardamandhulo Undhi ||2||Watch Mounamgane Edhagamani Video SongMounamgane Edagamani Song Lyrics In Teluguమౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్ధమందులో ఉంది మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరమెంతొ ఉందనీ దిగులుపడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ తెలుసుకుంటె సత్యమిది తలుచుకుంటె సాధ్యమిది మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్ధమందులో ఉంది చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కధలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ నచ్చినట్టుగా నీ తలరాతని నువ్వే రాయాలీ నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది |