Bujjikondave Song Lyrics
Bujjikondave Lyrics in Telugu
బంగారమే బంగారమే.. నువ్వు నా వరమే
నీ క్షేమమే నీ సంతోషమే.. నను నడిపించే బలమే
చిట్టి తల్లి నీవే పుట్టుకంటే నీదే
దేవతల్లే నన్నే చేరుకుంటివే
గుండె పట్టనంత ప్రాణం అంటే నీవే
నాన్న లాగా నన్నే ఎంచుకుంటివే
ఓ చంటి పాపనై.. నీతో నన్ను ఆడనివ్వవే
నీ ఆట పాట.. ముద్దు ముచ్చట పిచ్చనివ్వవే
నా ఆయువంతా నువ్వు.. అంది పుచ్చుకుని చిందులాడవే
బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే!
బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే!
ఏదో జన్మలో అమ్మవే ఆ.. నా పాపవైనవిలా నమ్మవే
లోకాన పూసే ప్రతి నవ్వు తీసి
పువ్వుల దండ చేసి నీకందించనా
నీకై కన్న కళ్ళగా ఉంది జీవితం
ప్రతి రుతువు నీకై తేవాలి వసంతం
నా ఆనందాలకి అద్దం పట్టిన.. కంటి చెమ్మవే
నా అదృష్టాలన్నీ భూమికి దించిన.. బుట్టబొమ్మవే
నా గుండె పైన చిందులాడ వచ్చిన.. జాబిలమ్మవే
బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే!