ANNA NEE VOTE RATE ENTHA? Lyrics Mama sing|Singer - Ram Miriyala

Singer | Ram Miriyala |
Composer | Ram Mirayala |
Music | Ram Mirayala |
Song Writer | Mama Sing |
Lyrics
Song Lyrics :
ఓటరన్న ఈ సారి నీ ఓటు రేటెంత?
ఓటరన్న ఈ సారి నీ ఓటు రేటెంత?
నీ లీడెరిచ్చే చీప్ లిక్కర్ క్వార్టర్ అంత
వాడు బిచ్చమేసే రెండు వేల నోటంత
నీ కులపోడైతే వాడికి డిస్కౌంట్టా
ఏంది ఇంతేనా నీ రేటు పెంచు కొంతా
ఓటరన్న ఈ సారి నీ ఓటు రేటెంత?
హే . . . ఈ సారి నీ ఓటు రేటెంత?
గెలిచే దాక నిన్ను కాళ్ళు మొక్కి దేవుడంటారు
నీ పేరు చెప్పుకొని ప్రసాదాన్ని వాళ్ళే తింటరు
గెలిచి అసెంబ్లీ లో ఒకల్నోకరు తిట్టుకుంటరు
ఆపై నిన్ను నీ సమస్యల్ని బొంద పెడతరు
నాయకులూ ఏవేవో ఇస్తానంటే మురిసిపోతవు
ఐదేళ్లు ఆశతోని ఎదురు చూసి అలసిపోతవు
విద్య ఆరోగ్యం సంగతేమో అస్సలడగవు
బిడ్డల భవిశ్యత్తు చేతులారా అమ్ముకుంటవు
వాళ్ళు వంగి పెట్టే దండాలకు అర్థం వేరు
లీడర్లు చేసే దందాలు మనకు అర్థం కావు
ఓరన్నా నీకిచ్చే పైసలు వారి పెట్టుబడి
మేనిఫెస్టోలు హామీలు మొక్కుబడి
నీ రేటు ఐదేళ్లకు చాలా చాలా తక్కువిది
లైఫ్ సెట్ ఐపోయేలాగా పెంచు మరి
ఓటరన్న ఈ సారి నీ ఓటు రేటెంత?
హే . . . ఈ సారి నీ ఓటు రేటెంత?
నీ లీడెరిచ్చే చీప్ లిక్కర్ క్వార్టర్ అంత
వాడు బిచ్చమేసే రెండు వేల నోటంత
నీ కులపోడైతే వాడికి డిస్కౌంట్టా
ఏంది ఇంతేనా నీ రేటు పెంచు కొంతా
ఓటరన్న ఈ సారి నీ ఓటు రేటెంత?
హే . . . ఈ సారి నీ ఓటు రేటెంత?
0 Comments
If you have any doubts. Please let me know