నీవుంటే చాలు (Neevuntey Chaalu)
Movie: Michael | Singer: Sid Sriram
నీవుంటే చాలు.. నీవుంటే చాలు
నా వెంట జతగా నీవుంటే చాలు
నా మది సరసులో చినుకుల సరసమాడి
తామర విరులపై తడి నువ్వై తడిమినావే
నీవు నేను ఒకటైపోతే
లోకం అంతా వర్ణం మారే
నా కలలనే వెదికిన కనులు నీవే
నా ప్రథమే దోచిన రసన నీవే
నా మునుపునే మరపుగా మార్చినావే
నా తీరని దాహమై ఉండవే నీవే నీవే
నీవుంటే చాలు.. నీవుంటే చాలు
నేనుండిపొనా నీ సగపాలు
నీవుంటే చాలు.. నీవుంటే చాలు
నా వెంట జతగా
వుంటే చాలు చాలు చాలు చాలు
ఇనుమిల కరిగే నీ చూపుకే ప్రేమగా
ఇరుసుల మనసునే నడిపేలే గోముగా
మన్నునే మిన్నగా మార్చెనే నెరుగా
మెలికనే మలుపుగా తీర్చెనే తీరుగా
నా నిమిషం నీ కొరకే
సాగినదే అలలుగా నీ వైపే
రే పగలు ఓ అడుగై సాగమనే ఇరువురం ఒక జతగా
నీవుంటే చాలు.. నీవుంటే చాలు నా కంటి కవితై
నీవుంటే చాలు చాలు చాలు
నాకే చాలు నీవుంటే చాలు
| Neevuntey Chaalu Song Details | |
|---|---|
| Track Title | Neevuntey Chaalu |
| Movie | Michael |
| Singer | Sid Sriram |
| Lyricist | Kalyana Chakravarthy Tripuraneni |
| Music Maker | Sam CS |
| Lead | Sundeep Kishan |
0 Comments
If you have any doubts. Please let me know