Swapnavenuvedo Full Song Lyrics - Ravoyi Chandamama
| Singer | S.P.Balasubramanyam, K.S.Chitra |
| Composer / Music | Mani Sharma |
| Song Writer | Veturi |
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
(m) స్వప్నవేణువేదో సంగీతమాలపించే
(f) సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
(m) జోడైన రెండు గుండెల ఏక తాళమో...
(f) జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో...
(m) లేలేత పూల బాసలు
(f) కాలేవా చేతి రాతలు
(m) స్వప్నవేణుвеదో సంగీతమాలపించే
(f) సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
CHARANAM 1:
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
(m) నీదే ప్రాణం... నీవే సర్వం...
నీకై చేశా... వెన్నెల జాగారం...
(f) ప్రేమ నేడు... రేయి పగలు...
హారాలల్లే... మల్లెలు నీకోసం...
(m) కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నే రానా...
(f) కాలాలే ఆగిపోయినా...
(m) గానాలే మూగబోవునా...
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
CHARANAM 2:
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
(f) నాలో మోహం... రేగే దాహం...
దాచేదెపుడో... పిలిచే కన్నుల్లో...
(m) ఓడే పందెం... గెలిచే బంధం...
రెండూ ఒకటే... కలిసే జంటల్లో...
(f) మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం...
(m) వారేవా ప్రేమ పావురం
(f) వాలేదే ప్రణయ గోపురం
(m) స్వప్న వేణువేదో సంగీతమాలపించే
(f) సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
(m) జోడైన రెండు గుండెల ఏక తాళమో...
(f) జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో...
(m) లేలేత పూల బాసలు
(f) కాలేవా చేతి రాతలు
స్వప్న వేణువేదో (m) సంగీతమాలపించే
సుప్రభాత వేళ (f) శుభమస్తు గాలి వీచే...
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
0 Comments
If you have any doubts. Please let me know