What are some Indian songs with great lyrics in Telugu movies? telugu top 10 lyrics

Well, there are many songs in telugu top 10 lyrics lyrics some are below read them 

1.SIRIVENNELA

Song: విధాత తలపున

Singers: S.P Balasubramanyam

Lyrics: Sirivennela Seethaarama Shastri

Music: K.V Mahadevan


విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసమ్
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం... ఆఆఆఆఆఆ...

సరసస్వర సురఝారీగమనమౌ సామవేద సారమిది
సరసస్వర సురఝారీగమనమౌ సామవేద సారమిది
నేపాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనమ్
విపంచినై వినిపించితిని ఈ గీతమ్

ప్రార్దిష వీణియ పైన దినకర మయూహ తంత్రులపైన

జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన
ప్రార్దిష వీణియ పైన దినకర మయూహ తంత్రులపైన
జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా

విరించినై విరచించితిని ఈ కవనమ్
విపంచినై వినిపించితిని ఈ గీతమ్

జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం
జనించు…

2.MEGHA SANDESHAM

Song: ఆకాశదేశానా.. ఆషాడమాసానా

Singers: K.Jesudas

Lyrics: Veturi Sundara Rama Murthy

Music: Ramesh Naidu



ఆకాశదేశానా.. ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా
విరహమో.. దాహమో.. విడలేని మోహమో..
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం..

చరణం 1:

వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని.. కడిమివోలె నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో..
విన్నవించు నా చెలికి విన్న వేదనా.. నా విరహ వేదనా

ఆకాశదేశానా.. ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా

చరణం 2:

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని.. శిధిల జీవినైనాని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాస్పజల ధారలతో..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా

ఆకాశదేశానా.. ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా
విరహమో.. దాహమో.. విడలేని మోహమో..
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం..

3.KHALEJA

Song: సదాశివా సన్యాసీ

Lyrics: Ramajogaiah Shastri

Singers: Hemachandra,Kaarunya

Music: Manisharma



ఓం నమో శివ రుద్రాయ
ఓం నమో శితి కంఠాయ
ఓం నమోహర నాగాభరణాయ ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమోనిటలాక్షాయ
ఓం నమో భస్మాంగాయా
ఓం నమోహిమశైలావరణాయ ప్రమథాయ
ధిమి ధిమి తాండవకేళీలోలాయ

సదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసి పొంగి పోయినాది పల్లె కాశి
హే... సూపుల సుక్కాని దారిగ
సుక్కల తివాసీ మీదిగా
సూడసక్కని సామి దిగినాడురా
ఏసైరా ఊరూవాడా దండోరా
ఏ రంగుల హంగుల పొడలేదురా
ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా
నీ తాపం శాపం తీర్చేవాడేరా
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల
లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు
నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు

ఓం నమఃశివ జై జై జై... ఓం నమఃశివ జై జై జై
ఓం నమఃశివ go to the trance and say Jai jai jaiజై జై జై
Sing along and sing shiva shambo all the way
Om namah shiva jai jai jaiఓం నమఃశివ జై జై జై
Heal the world is all we pray…

4. Naa Autograph Sweet Memories

Song: మౌనంగానే ఎదగమని

Lyrics: Chandrabose

Singers: K.S Chitra

Music: M.M Keeravani



మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని భాదపడకు నేస్తమా
భాద వెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది
తెలుసుకుంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది…

5. YETO VELLIPOINDHI MANASU

Song: తాను-నేను మొయిలు-మిన్ను

Lyrics: Anant Sriram

Singers: Vijay Prakash

Music: A.R.Rehaman


తాను-నేను మొయిలు-మిన్ను
తాను-నేను కలువ-కొలను

తాను-నేను పైరు-చేను
తాను-నేను వేరు-మాను

శశి తానైతే, నిశినే నేను
కుసుమం-తావి తాను-నేను

వెలుగు-దివ్వె తెలుగు-తీపి
తాను-నేను మనసు-మేను

దారి నేను, తీరం తాను
దారం నేను, హారం తాను

దాహం నేను, నీరం తాను
కావ్యం నేను, సారం తాను

నేను-తాను రెప్ప-కన్ను
వేరైపోని పుడమి-మన్ను

నేను-తాను రెప్ప-కన్ను
వేరైపోని పుడమి-మన్ను

తాను-నేను మొయిలు-మిన్ను
తాను-నేను కలువ-కొలను

తాను-నేను గానం-గమకం
తాను-నేను ప్రాయం-తమకం

తాను-నేను…

Post a Comment

0 Comments