Remembering the man who brought special Respect to our Telugu cinema, A True Leader, Padmasri Dr. Shri Nandamuri Taraka Rama Rao Garu on his birth anniversary. 🙏
Krushivunte Manushulu Rushulavutharu Song from Adavi Ramudu Movie | Telugu Motivational Songs
#NenuSaitham #LegendaryNTRJayanthi
#JoharNTR
Telugu song lyrics
కృషి ఉంటే
మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకీ తరగని వెలుగొతారు
ఇలవేలుపులౌతారు
(సినిమా: అడవి రాముడు, కవి: వేటూరి)
--------
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లన మోవికి తాకితే గేయాలు
(పాట: గోవుల్లు తెల్లన, సినిమా: సప్తపది, కవి: వేటూరి)
--------
అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
(పాట: శ్రీరస్తూ శుభమస్తూ, సినిమా: పెళ్లిపుస్తకం, కవి: ఆరుద్ర)
--------
అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్నీ
జరిగేవన్నీ మంచికనీ
అనుకోవడమే మనిసి పనీ
(పాట: నీ సుఖమే నే కోరుకున్నా, సినిమా: మురళీకృష్ణ, కవి: ఆత్రేయ)
--------
కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి
మీ కండలు పెంచినదీ గుండెలతో కాదా
ఎర్రని తనరక్తాన్నే తెల్లని నెత్తురుచేసి
పెంచుకున్న తల్లీ ఒక ఆడదనీ మరిచారా
కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర
ఏనాడో మీరుంచిన లేత పెదవిముద్ర
ప్రతి భారతి సతిమానం చంద్రమతీ మాంగళ్యం
మర్మస్థానం కాదది మీ జన్మస్థానం
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం
(పాట: ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో..., సినిమా: ఫ్రతిఘటన, కవి: వేటూరి)
--------
జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
(పాట: శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా, సినిమా: రహస్యం, కవి: మల్లాది రామకృష్ణశాస్త్రి గారు)
--------
విడిపోకు చెలిమితో
చెడిపోకు కలిమితో
జీవితాలు శాశ్వతాలు కావుర
దోస్తీ ఒకటే ఆస్తిరా
(సినిమా:మంత్రిగారి వియ్యంకుడు, కవి: వేటూరి)
--------
నాలో నాయన నన్నాడమంటే
నేనాడుతున్నా యీ ఆట
నేనెట్టాడితె తానట్టాడుతు
నా నీడ చూస్తది నా ఆట
(సినిమా: మహాకవి కాళిదాసు, కవి: పింగళి నాగేంద్ర రావు గారు)
--------
పాయసాన గరిటై తిరిగే
పాడు బతుకులెందుకు మనకూ
పాలలోన నీరై కరిగే
బంధమొకటి చాలును తుదకు
(పాట:ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది, సినిమా:ఏడంతస్తుల మేడ, కవి: వేటూరి)
--------
ఒకరికి ఖేదం ఒకరికి మోదం
సకలము తెలిసిన నీకు వినోదం
నీవారెవరో పైవారెవరో
ఆ విధికైననూ తెలియదయా
(పాట: భళి భళి భళి భళి దేవా, సినిమా: మాయాబజార్, కవి: పింగళి నాగేంద్ర రావు గారు)
--------
ఉదయం చుంబన సేవనం
మధ్యాహ్నం కౌగిలి భోజనం
సాయంత్రం పుష్ప నివేదనం
రాతిరివేళల మహనైవేద్యం
(పాట: వయసు వయసు వయసు వరసగున్నది వాటం, సినిమా: గ్యాంగ్‌లీడర్, కవి: వేటూరి)
--------
మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా
(పాట: ధనమేరా అన్నిటికీ మూలం, సినిమా: లక్ష్మీనివాసం, కవి: ఆరుద్ర)
--------
ఎగిరి ఎగిరి పోయింది సీతాకోక చిలక
మిగిలిందీ వేళ్ళపై అది వాలిన మరక
(పాట: దేవతలా నిను చూస్తున్నా దీపంలా జీవిస్తున్నా, సినిమా: ప్రాణం, కవి: వేటూరి)
--------
ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... ఇన్ని మాటలు
(పాట: ఏ కులమూ నీదంటే గోకులమూ నవ్వింది. సినిమా: సప్తపది, కవి: వేటూరి)
--------
వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే
అది నీకు మునుపే తెలుసు
(పాట: ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడె, సినిమా:బంధిపోటు, కవి: ఆరుద్ర)
--------
అంతా మట్టేనని తెలుసూ
అదీ ఒక మాయేనని తెలుసూ
తెలిసీ వలచీ విలపించుటలో
తీయదనం ఎవరికి తెలుసూ
(పాట: మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే, సినిమా: ప్రేమ నగర్, కవి: ఆత్రేయ)
--------
గుండె మంట లారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు
ఉన్నోళ్ళు పొయినోళ్ళ తీపిగురుతులు
(పాట: పాడుతా తీయగా చల్లగా, సినిమా: మూగ మనసులు, కవి: ఆత్రేయ)
--------
తుడిచి కన్నీళ్ళు, కలిసి నూరేళ్ళు జతగ ఉందామోయి. --(పాట: ఓ జాబిలీ వెన్నలా ఆకాశం, రంగూన్ రౌడీ, కవి: వేటూరి)
--------
నీ హృదయం తపన తెలిసీ
నా హృదయం కనులు తడిసే వేళలో
(పాట: ఓం నమః, సినిమా: గీతాంజలి, కవి: వేటూరి)
--------
చిటారుకొమ్మన
మిఠాయి పొట్లం
చేతికందదేం గురుడా
వాటం చూసీ వడుపు చేసీ
వంచర కొమ్మను నరుడా
(సినిమా: కన్యాశుల్కం, కవి: మల్లాది రామకృష్ణశాస్త్రి గారు)
--------
మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది
(పాట: జగతి సిగలో జాబిలమ్మకు వందనం, సినిమా: పరదేశి, కవి: వేటూరి)
--------
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
( సినిమా: గుండమ్మ కథ, కవి: పింగళి నాగేంద్ర రావు)
0 Comments
If you have any doubts. Please let me know