Shreya Ghoshal Telugu biography శ్రేయ ఘోషాల్ బయోగ్రఫీ

Header Ads Widget

Shreya Ghoshal Telugu biography శ్రేయ ఘోషాల్ బయోగ్రఫీ

AdSense Responsive Ad Unit

శ్రేయ ఘోషాల్ బయోగ్రఫీ

Shreya Ghoshal

శ్రేయ ఘోషాల్ భారత గాయని. శ్రేయ ఘోషాల్ పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్లో ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి బిశ్వజీత్ ఘోషాల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇంజనీరుగా పని చేసేవారు. ఆమె తల్లి సాహిత్యంలో పోస్ట్ - గ్రాడ్యూయేట్.

Shreya Ghoshal Playback Singer

Pic credit : Contury thoughts telugu youtube

హిందీ చిత్రసీమయైన బాలీవుడ్లో ప్రముఖ నేపధ్య గాయని, హిందీ కాకుండా ఇతర భారతీయ భాషలైన అస్సామీ, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠీ మరియు మళయాళంలో ఎన్నో పాటలు పాడారు. ఇళయరాజ సంగీతమందించిన 'నిన్ను చూడక నేనుండలేను' సినిమాలొ సరి సరి పాటతో మొదలు పెట్టింది. తెలుగులొ శ్రేయ గాత్రానికి అధిక సంఖ్యలొ అభిమానులున్నారు. 2015లొ షిల్లాదిత్యా ముఖోపాధ్యాయాని వివాహంచేసుకుంది.

AdSense Responsive Ad Unit

సంగీత ప్రస్థానం

శ్రేయ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ చిత్రం "దేవదాస్"తో ప్రారంభించారు. ఆమెకు ఆ మొదటి చిత్రమే భారత జాతీయ చలనచిత్ర పురస్కారం తెచ్చిపెట్టింది. అలా ఇప్పటికి ఆమెకు 4 జాతీయ పురస్కారాలు, 5 ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 4 దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి.

నేపథ్యం

శ్రేయాకు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి ఆమెకు ఆది గురువుగా మారి సంగీతంలో ఓన మాలు నేర్పారు. ఆరేళ్ల వయస్సులోనే కోటాలోని రాకేష్‌ శర్మాజీ, శ్రీ జయవర్ధన్‌ భట్నాగర్‌ వద్ద హిందుస్తానీ శాస్ర్తీయ సంగీతంలో ప్రావీణ్యం గడించారు. 1997 ముంబైకి మకాం మార్చారు.

కెరీర్ మైలురాళ్లు

  • 1995: ఆల్‌ ఇండియా లైట్‌ వోల్‌ సంగీత పోటీ విజయం.
  • 1996: టీవిఎస్‌ సారేగామా విజయం.
  • 2002: దేవదాస్ చిత్రంతో ప్లేబ్యాక్‌ కెరీర్‌ ప్రారంభం.

Video credit: V7MEDIA

AdSense Responsive Ad Unit
Disclaimer: This content is for informational purposes. All rights belong to respective owners.

Post a Comment

0 Comments